బిహార్ ఎన్నికల్లో ఎన్డీఏ తరఫున ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్ ప్రచార బరిలోకి దిగుతున్నారు. రెండురోజులపాటు అక్కడ ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. కల్యాణదుర్గం పర్యటనను ముగించుకున్న అనంతరం ఇవాళ మధ్యాహ్నం ఆయన పట్నా చేరుకోనున్నారు. సాయంత్రం రెండు సమావేశాల్లో పాల్గొని ప్రసంగించనున్నారు. రేపు ఉదయం పట్నాలో ఎన్డీఏ అభ్యర్థులకు మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు.



















