హైదరాబాద్‌లోని షేక్‌పేట్ ప్రాంతంలో అగ్నిప్రమాదం కలకలం రేపింది. శుక్రవారం అర్థరాత్రి సమయంలో కుతుబ్‌షాహీ టూంబ్స్ సమీపంలోని విద్యుత్ సబ్‌స్టేషన్ వద్ద ఈ ఘటన జరిగింది. సబ్‌స్టేషన్ పక్కన నిల్వ చేసిన పాత టైర్లకు అకస్మాత్తుగా మంటలు అంటుకోవడంతో మంటలు వేగంగా వ్యాపించాయి.
టైర్ల నుంచి ఎగిసిపడిన మంటలు సమీపంలోని ఫుట్‌పాత్‌పై ఉన్న చిన్న దుకాణాలకు కూడా వ్యాపించాయి. దీంతో అక్కడి వ్యాపారులు, స్థానికులు భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.
సమయానికి అగ్నిమాపక సిబ్బంది స్పందించడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో ప్రాణనష్టం జరగలేదు. అయితే కొన్ని దుకాణాలకు నష్టం జరిగినట్లు సమాచారం.
ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. గుర్తు తెలియని వ్యక్తులు ఉద్దేశపూర్వకంగా టైర్లకు మంటలు అంటించి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రాంతంలో ఉన్న సీసీటీవీ కెమెరాల ఫుటేజీని పరిశీలిస్తూ అసలు కారణాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు.
Andhra pradesh Andhrapradesh AndhraPradeshNews APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EntertainmentNews Geopolitics Government India IndiaNews InternationalNews LatestNews LawAndOrder MarketUpdate News news24 newsalert NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















