ఆట చాలా వేగంగా సాగినప్పుడు నెమ్మదించడానికి ప్రయత్నించండి” — భారత మహిళల జట్టుకు ఈ సలహా ప్రముఖ క్రికెటర్ సచిన్ తెందుల్కర్ ఇచ్చారు. దక్షిణాఫ్రికాతో జరిగిన ప్రపంచకప్ ఫైనల్‌కు ముందు సచిన్ ఫోన్ చేసి విలువైన సూచనలు ఇచ్చారని కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ వెల్లడించారు.
‘‘ఫైనల్‌కు ముందు రాత్రి సచిన్ సర్ కాల్ చేసి తన అనుభవాలను పంచుకున్నారు. జట్టును సమతూకంగా ఉంచాలని చెప్పారు. మ్యాచ్ వేగంగా సాగుతున్నప్పుడు ఆ వేగాన్ని నియంత్రించాలని, లేకపోతే అవకాశాలు వదిలిపోతాయని సూచించారు’’ అని హర్మన్ గుర్తు చేసుకుంది.
ఫైనల్ ముగిసి అయిదు రోజులైనా ఈ విజయం ఇంకా నమ్మడం కష్టం అని ఆమె చెప్పారు. ‘‘జట్టు సభ్యులను ఒకరినొకరు చూసినప్పుడు ‘మనం ప్రపంచ ఛాంపియన్లు’ అని అనిపిస్తోంది. ఆ అనుభూతి చాలా ప్రత్యేకంగా ఉంది. మా తల్లి, తండ్రితో కలిసి ప్రపంచకప్ విజయం ఆనందించడం చాలా గొప్పగా అనిపించింది. నిజానికి, కప్ నెగ్గాం అనే ఆలోచనను పూర్తిగా అర్థం చేసుకోవడానికి కొంత సమయం పడుతుంది’’ అని హర్మన్ వివరించారు.




















