రెండో దశ ఎన్నికల పోలింగ్‌కు బిహార్ సిద్ధమవుతున్న నేపథ్యంలో, సీతామహిలో ఎన్నికల ప్రచారంలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ఆర్జేడీపై ఘాటుగా మండిపడ్డారు. బిహార్ ప్రజలకు మేము ల్యాప్‌టాప్‌లు ఇస్తే, వారు రివాల్వర్లు ఇస్తున్నారంటూ మోదీ ఘాటుగా వ్యాఖ్యానించారు.
ప్రధాని మోదీ అన్నారు, “బిహార్ విద్యార్థుల కోసం మేము కంప్యూటర్లు, ఫుట్‌బాల్, హాకీ స్టిక్‌లు అందిస్తున్నాం. కానీ ఆర్జేడీ ప్రజలకు తుపాకులు ఇచ్చే విషయంపై మాత్రమే మాట్లాడుతోంది. బిహార్ ప్రజలు తుపాకుల ప్రభుత్వాన్ని కోరడంలేదు. వారు ప్రతిపక్ష నేతలకు నిద్ర లేని రాత్రులు ఇచ్చేస్తున్నారు. ఆర్జేడీ తమ ఎన్నికల ప్రచారంలో ఏం చేయాలనుకుంటుందో స్పష్టంగా చూపిస్తోంది. వేదికలపై అమాయక పిల్లలను దోపిడీదారులుగా మార్చాలని ప్రయత్నిస్తున్నారు. బిహార్‌లో పిల్లలు డాక్టర్లు అవ్వాలా.. దోపిడీదారులు కావాలా? మన పిల్లలను చెడ్డవారిగా మార్చే వారిని మేము గెలిపిస్తామా?”
మోదీ ఆర్జేడీ, కాంగ్రెస్ పార్టీలకు ఇండస్ట్రీలో ఏ, బీ, సీ, డీ పరిజ్ఞానం లేదని, పరిశ్రమలు మూసివేయడం మాత్రమే వారికి తెలుసని, జంగిల్ రాజా 15 ఏళ్ల పాలనలో బిహార్‌లో పెద్ద ఆసుపత్రి, వైద్య కళాశాల కూడా ఏర్పాటుచేయలేదని పేర్కొన్నారు. సీఎం నీతీశ్ కుమార్ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి వచ్చాకే బిహార్ ప్రజలకు కోల్పోయిన నమ్మకం తిరిగి వచ్చింది అని చెప్పారు. పెట్టుబడిదారులు రాష్ట్రానికి వచ్చేందుకు ఆసక్తి చూపిస్తున్నారని, మన సంస్కృతి, సంప్రదాయాలను అవమానించిన వారిని ఎన్నికల్లో శిక్షించాలని ప్రజలకు పిలుపునిచ్చారు.




















