చిన్న పరిశ్రమల అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తూ, స్థానికంగా ఉపాధి అవకాశాలను పెంపొందించేందుకు కూటమి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోంది. ఈ దిశగా రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేయనున్న 50 ఎంఎస్‌ఎంఈ పార్కుల తొలి దశలో భాగంగా, ప్రకాశం జిల్లా పీసీపల్లి మండలం నుంచి సీఎం చంద్రబాబు మంగళవారం వర్చువల్‌గా ప్రారంభించనున్నారు. స్థానికంగా గుంటూరు లింగన్నపాలెంలో ఎంఎస్‌ఎంఈ పార్కు కోసం 55 ఎకరాలు కేటాయించగా, అందులో 20 ఎకరాల్లో రూ.7 కోట్లు ఖర్చుతో మౌలిక వసతులు సిద్ధం చేశారు. ఇక్కడి నుంచే రాష్ట్రంలోని మిగతా పార్కులను కూడా సీఎం వర్చువల్‌గా ప్రారంభించనున్నారు.


















