చిన్నమండెం: మహిళలను పారిశ్రామికవేత్తలుగా తయారు చేసే బాధ్యత తనదని సీఎం చంద్రబాబు అన్నారు. 2029 నాటికి ప్రతి పేదవాడికి సొంతిల్లు ఉండాలనేది ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. ఏపీలో 3 లక్షల ఇళ్ల గృహప్రవేశాలకు సీఎం శ్రీకారం చుట్టారు. అన్నమయ్య జిల్లా చిన్నమండెం మండలం దేవగుడిపల్లిలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. పలువురు లబ్ధిదారులకు ఇంటి తాళాలు అప్పగించారు. రాష్ట్రంలోని మిగతా ప్రాంతాల్లో గృహ ప్రవేశాలను వర్చువల్‌గా ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘ఇల్లు అంటే నాలుగు గోడలు కాదు.. భవిష్యత్తుకు భద్రత. పేదలకు తొలిసారి పక్కా ఇళ్లు నిర్మించిన వ్యక్తి ఎన్టీఆర్. కూడు, గూడు, దుస్తులు.. నినాదంతో పుట్టిన పార్టీ.. తెదేపా. ఇళ్ల లబ్ధిదారులు అందరికీ అభినందనలు. ఇవాళ రాష్ట్రవ్యాప్తంగా 3 లక్షల ఇళ్లు అప్పగిస్తున్నాం. మళ్లీ ఉగాది నాటికి మిగతావి పూర్తి చేసి అప్పగిస్తాం. ఇది పేదల ప్రభుత్వం.. వారికి న్యాయం చేసేందుకు పనిచేస్తాం. ఉగాది నాటికి 5.9 లక్షల ఇళ్లకు గృహ ప్రవేశాలు చేయిస్తాం.



















