ఎక్కడా వివాహం జరిగితే సాధారణంగా వధూవరులు, కుటుంబ సభ్యులు, బంధువులు గ్రూప్ ఫోటోలు తీసుకుంటారు. అయితే నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేటలో జరిగిన ఈ కార్యక్రమంలో ఒకే ముహూర్తానికి 61 జంటలు ఒకేసారి ఫోటోలో కనిపించాయి. ఈ అరుదైన సామూహిక వివాహాలకు ఆదివారం అప్ప శివ జ్యుయలర్స్ ఆధ్వర్యంలో వేదిక కల్పించారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన 61 జంటలు ఉదయం 11:05 గంటలకు మాంగళ్యధారణతో వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించినప్పటి ప్రత్యేక ఉద్దేశ్యం… దంపతుల తల్లిదండ్రులు పేదల వివాహాలకు సహాయం చేసిన సంప్రదాయాన్ని కొనసాగించడం. అనంతరం కొత్త దంపతులకు అవసరమైన వస్తు సామగ్రిని అందజేశారు. అచ్చంపేట ఎమ్మెల్యే డా. వంశీకృష్ణ కూడా కొత్త వధూవరులను ఆశీర్వదించారు.


















