ప్రసాద్ ఐమ్యాక్స్‌లో జరిగిన ఫిల్మ్ ఫెస్టివల్‌కు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రారంభం పలికారు. తెలంగాణ నార్త్–ఈస్ట్ కనెక్ట్ కార్యక్రమంలో భాగంగా రెండు రోజుల పాటు ఈ వేడుక జరుగనుంది. కార్యక్రమంలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఎఫ్‌డీసీ ఛైర్మన్ దిల్‌రాజు పాల్గొన్నారు.
ఈ సందర్భంలో గవర్నర్ మాట్లాడుతూ, ఈశాన్య రాష్ట్రాలు సాంస్కృతిక వైవిధ్యంతో ప్రత్యేకత కలిగినవని తెలిపారు. మణిపూర్, అస్సాంలో ప్రతిభావంతులైన సినీ దర్శకులు ఉన్నారని పేర్కొన్నారు. దేశం గర్వించదగ్గ చిత్ర పరిశ్రమ తెలంగాణలో ఉందని అభినందించారు.


















