కుప్పంలో సంజీవని ప్రాజెక్టు అమలు, యూనివర్సల్ హెల్త్ స్కీంపై సమగ్ర చర్చ జరిగింది. సంజీవని ప్రాజెక్టు స్కీంను జనవరి నుంచి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా ప్రారంభించనున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. అనంతరం రాష్ట్రవ్యాప్తంగా అమలు చేసేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టు వెల్లడించారు. తొలివిడతలో ఆదోని, మదనపల్లి, మార్కాపురం, పులివెందుల మెడికల్ కాలేజీల నిర్మాణంపై చర్చించారు. పీపీపీ ప్రాతిపదికన ఈ నాలుగు వైద్య కళాశాలలను నిర్మించడానికి ప్రభుత్వం ముందుకొచ్చింది. విద్యార్థులు, ప్రజలు, సామాజిక ప్రయోజనాల దృష్ట్యా ఈ ప్రాజెక్టులను పీపీపీ విధానంలో చేపడుతున్నట్లు అధికారులు తెలిపారు. ఈ విధానంతో బోధనాసుపత్రులు వేగంగా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని పేర్కొన్నారు




















