జేఎన్‌టీయూ హైదరాబాద్ వజ్రోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకుంటున్నారు. ఇంజనీరింగ్ కళాశాల స్థాపన 60 ఏళ్లు పూర్తి కావడం సందర్భంగా ఈ వేడుకల్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించబడ్డాయి. కార్యక్రమంలో పాల్గొన్న ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ముఖ్యమైన వ్యాఖ్యలు చేశారు. జేఎన్‌టీయూ కేవలం ఒక విశ్వవిద్యాలయం మాత్రమే కాకుండా, దేశానికి, ముఖ్యంగా తెలంగాణకు గొప్ప ఆస్తి అని అన్నారు. ఇంజనీర్లను సిద్ధం చేసే శక్తివంతమైన “దేశ ఇంజిన్” అని ప్రషంసించారు. ISRO నుండి Google, DRDO నుండి Tesla వరకు JNTU విద్యార్థుల ప్రతిభ ప్రపంచానికి గర్వకారణమని పేర్కొన్నారు. విద్య ఖర్చు మాత్రమే కాకుండా భవిష్యత్తును నిర్మించే పెట్టుబడిగా ఉంటుందని విద్యార్థులకు సందేశం ఇచ్చారు. యువత ఉద్యోగాలు వెతకనే కాకుండా, ఉద్యోగాలను సృష్టించే విధంగా ఎదగాలని సూచించారు. మొదటి 60 ఏళ్ల కంటే, వచ్చే 60 ఏళ్లు మరింత మహోన్నతంగా ఉండాలని ఉప ముఖ్యమంత్రి కోరారు.


















