తెలంగాణలో కులగణన దేశానికి ఆదర్శమని రాహుల్ గాంధీ చెప్పిన విషయాన్ని ప్రస్తావిస్తూ, బీఆర్‌ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఎద్దేవా చేశారు. ఈ మేరకు ‘ఎక్స్’లో పోస్ట్ చేస్తూ,
“బీసీలకు 42% రిజర్వేషన్లు ఇస్తామని ప్రకటించారు. ఆ ప్రక్రియ కోసం రూ.160 కోట్లు ఖర్చు చేశారు. కానీ పంచాయతీ ఎన్నికల్లో మాత్రం బీసీలకు కేవలం 17% రిజర్వేషన్లే కేటాయించారు. ముందు ఉన్న 24% రిజర్వేషన్లను 17%కు ఎందుకు తగ్గించారు? రిజర్వేషన్ల తగ్గింపు, ప్రజాధనం వృథాపై రాహుల్ గాంధీ స్పందిస్తారా?” అని ప్రశ్నించారు.


















