“ఆలయం నిర్మించాలన్న సంకల్పాన్ని 2019 లోనే చేసుకున్నాం. ఈ ప్రాంత రైతులను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను, పవిత్ర కార్యక్రమంలో వారు అందించిన సహకారం ప్రశంసనీయం. రాజధాని నిర్మాణం కోసం రైతులు 33 వేల ఎకరాలు స్వచ్ఛందంగా సమర్పించారు. ల్యాండ్ పూలింగ్‌లో భాగంగా భూమి ఇచ్చిన రైతులకు ప్రత్యేక ధన్యవాదాలు. దేవతల రాజధాని ఎలా ఉంటుందో మనం తెలుసు, అదే నమూనాలో మన రాజధాని అమరావతి ఉంటుంది. తప్పు చేసిన వారిని వెంటనే వెంకన్న శిక్షిస్తారు; ఈ జన్మలోనే శిక్ష ఎదురవుతుంది. వెంకటేశ్వర స్వామి నా ఇలవేల్పు, తిరుమల వెంకటేశ్వర స్వామి నా ప్రాణబిక్ష. శ్రీవారిని అవమానించుకునే ఏ పని కూడా నేను చేయను, ఎవరినీ చేయనివ్వను.”




























