తన కుటుంబంలో అసూయలు, వివాదాలు ఎప్పుడూ ఊహించలేదు అని మంచు లక్ష్మి (Manchu Lakshmi) తెలిపారు. సినిమాల ప్రచారంతో కాకుండా, వ్యక్తిగతంగా ఇంటర్వ్యూలు ఇవ్వడంలో ఆసక్తి ఉంటుందన్నారు. ఇటీవల ఒక పాడ్‌కాస్ట్‌లో పాల్గొని ఆమె అనేక విషయాలను పంచుకున్నారు. తల్లిగా, సోదరిగా, కుమార్తెగా ఉన్నా అన్ని బాధ్యతల్లో తాను 10/10 మార్కులు ఇచ్చుకునేలా ఉందని అన్నారు.
మంచు కుటుంబంలో చోటుచేసుకున్న వివాదాలపై మాట్లాడుతూ, “దేవుడు నాకు కనిపించి ఏదో ఒక వరం అడగమంటే, నా కుటుంబం మళ్లీ కలిసిపోవాలని కోరుకుంటాను. గతంలో ఉన్నట్లుగా అందరూ కలిసి ఉండాలని కోరతాను. ప్రతి కుటుంబంలో చిన్న గొడవలు ఉంటాయి, కానీ ఎన్ని సమస్యలు వచ్చినా చివరకు ఒక్కటవ్వాలి. భారతీయ కుటుంబాల్లో కొన్నిసార్లు గొడవలతో జీవితాంతం దూరమవ్వాలని భావిస్తారు, కానీ చివరికి మనకు మిగిలేది రక్తసంబంధీకులు మాత్రమే. ఫ్యామిలీతో ఉండటానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా, దూరాన్ని పెంచకూడదు” అన్నారు.
ముంబయిలో ఉండటంతో, ఈ విషయాల గురించి తెలిసినా ఆమె బాధపడలేదని, కొంతమంది మీడియా ఊహాగానాలు సృష్టించారని చెప్పారు. “వివాదం గురించి నేను మాట్లాడలేదు కాబట్టి, వారికి నచ్చినట్లు ఊహలు రూపొందించుకున్నారు. నాకు ఏం బాధ ఉంది, నా కుటుంబం గురించి నేను ఏం భావిస్తున్నానో, బయటవాళ్లకు వివరించాల్సిన అవసరం లేదు. ఇలాంటి వివాదాలు వస్తాయని ఎప్పుడూ ఊహించలేదు. అన్ని ఘటనలన్నీ చూశాక షాక్ తగిలింది” అని మంచు లక్ష్మి పేర్కొన్నారు.




















