ఈరోజు (13-01-2026)
ఉద్యోగస్తులకు అనుకూల ఫలితాలు కనిపిస్తాయి. మీరు ప్రారంభించిన పనుల్లో స్పష్టమైన పురోగతి ఉంటుంది. కీలక వ్యవహారాల్లో మీకు అనుకూలమైన, లాభదాయక ఫలితాలు లభిస్తాయి. ఉత్సాహం తగ్గకుండా ధైర్యంగా ముందుకు సాగాలి. చంద్ర ధ్యాన శ్లోకం పఠనం శుభప్రదం.
ఈ వారం (11-01-2026 – 17-01-2026)
శుభకాలం కొనసాగుతోంది. లక్ష్యాలను చేరుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఉద్యోగంలో ఉన్నత స్థానం, అధికారుల ప్రశంసలు లభిస్తాయి. ఆర్థికంగా బలపడతారు. వ్యాపారంలో కూడా మంచి లాభాలు సాధ్యమవుతాయి. ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటే సమస్యలు దూరంగా ఉంటాయి. శ్రీలక్ష్మీ ధ్యానం మనసుకు శాంతి, సంతృప్తిని ఇస్తుంది.




















