ఈరోజు (06-10-2026)
మీ ప్రతిభకు పెద్దల నుంచి ప్రశంసలు, అభినందనలు లభిస్తాయి. స్థిరాస్తికి సంబంధించిన విషయాల్లో పురోగతి ఉంటుంది. ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తగా వ్యవహరించండి. బంధుమిత్రులతో అనవసర వాగ్వాదాలకు దూరంగా ఉండటం మంచిది. ఆదిత్య హృదయం పారాయణం శుభఫలితాలను అందిస్తుంది.
ఈవారం (04-10-2026 – 10-10-2026)
ఈ వారం మనోబలంతో, ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగితే విజయావకాశాలు మెరుగుపడతాయి. మీ కృషికి తగిన ఫలితాలు లభిస్తాయి. కుజబలం ముఖ్యమైన బాధ్యతలను సమర్థంగా పూర్తి చేయడానికి సహకరిస్తుంది.
మధ్యలో కొన్ని సమస్యలు ఎదురైనా వెనుకడుగు వేయకుండా, సమయస్ఫూర్తితో వాటిని పరిష్కరించుకోవాలి. ఒక్కో పనిని క్రమపద్ధతిలో పూర్తి చేస్తూ ముందుకు సాగండి. శుక్రబలం ఆర్థికంగా కొంత అనుకూలతను అందిస్తుంది. అయితే ఆదాయానికి మించి ఖర్చులు చేయకుండా జాగ్రత్త వహించండి.
ఉద్యోగంలో ఏకాగ్రతతో పనిచేయడం అవసరం. వ్యాపార రంగంలో ప్రతి అడుగును ఆలోచించి వేయాలి. ఇతరుల మాటలను విని తొందరపడి నిర్ణయాలు తీసుకోకుండా, పరిస్థితులను స్వయంగా పరిశీలించి ముందుకు సాగడం మంచిది.
















