హైదరాబాద్‌లోని గచ్చిబౌలి ప్రాంతంలో ఔటర్ రింగ్‌రోడ్డు (ఓఆర్‌ఆర్) వైపు వెళ్లే మార్గంలో భారీగా ట్రాఫిక్ స్తంభించింది. మాదాపూర్ నుండి గచ్చిబౌలి ఓఆర్‌ఆర్‌ను కలిపే శిల్పా లేఅవుట్ ఫ్లైఓవర్‌పై ఒక కారు అకస్మాత్తుగా ఆగిపోవడమే ఈ ట్రాఫిక్ రద్దీకి ప్రధాన కారణం. ఫ్లైఓవర్‌తో పాటు చుట్టుపక్కల ప్రాంతంలో వాహనాలు పెద్ద సంఖ్యలో నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కారును తొలగించి, ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు


















