మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేటలో స్కూల్ పిల్లలను తీసుకెళ్తున్న ఆటో ఎదురుగా వచ్చిన బొలెరో వాహనాన్ని ఢీకొంది. దీంతో ఆటో అదుపు తప్పి పక్కనే ఉన్న కడెం ఉపకాలువలో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో పలువురు విద్యార్థులు గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని గాయపడిన పిల్లలను ఆస్పత్రికి తరలించారు. పట్టణంలోని భగత్‌సింగ్ నగర్‌కు చెందిన పది మంది పిల్లలను ఆటోలో ప్రభుత్వ పాఠశాలకు తీసుకెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.



















