ఉన్నత విద్య కోసం అమెరికా వెళ్లిన మరో తెలుగు విద్యార్థి అనూహ్యంగా ప్రాణాలు కోల్పోవడం విషాదాన్ని నింపింది. తెలంగాణ రాష్ట్రం మహబూబ్‌నగర్‌కు చెందిన 26 ఏళ్ల అరుణ్ సాయి రెడ్డి బొల్లెందుల అనారోగ్యంతో ఇటీవల మృతి చెందాడు.
అరుణ్ ప్రస్తుతం అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రం టెంపా నగరంలో నివసిస్తూ స్టెమ్ ఓపీటీ (ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్)లో ఉన్నాడు. ఉన్నత విద్య పూర్తిచేసిన తర్వాత ఫుల్ టైమ్ ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తున్న అతడు, జూన్ 19న అకస్మాత్తుగా అనారోగ్యానికి గురయ్యాడు.
తక్షణమే అతడిని స్థానిక ఆసుపత్రికి తరలించినప్పటికీ పరిస్థితి విషమించి చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన కుటుంబ సభ్యులు, స్నేహితులను తీవ్ర విషాదంలోకి నెట్టింది.
అతని మృతదేహాన్ని స్వదేశానికి తరలించేందుకు అవసరమైన ఏర్పాట్లు జరుగుతున్నాయని సమాచారం. ఈ ఘటనతో విదేశాల్లో ఉన్న తెలుగు విద్యార్థుల భద్రత, ఆరోగ్య పరిస్థితులపై మరోసారి ఆందోళన వ్యక్తమవుతోంది.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















