మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ హైదరాబాద్‌లోని మాదాపూర్ హెచ్‌ఐసీసీలో బుధవారం జరిగిన ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొని, తన అనుభవాల గురించి హృదయపూర్వకంగా పంచుకున్నారు. వైఫల్యాల నుంచి నేర్చుకున్న పాఠాలు మనకు విజయాలను సాధించడానికి ఎంతగా సహాయపడుతాయో యువరాజ్ సింగ్ చెప్పారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ హాస్య నటుడు బ్రహ్మానందం మరియు సీవీ ఆనంద్ కూడా హాజరయ్యారు.తాను ఎన్నో సవాళ్లను ఎదుర్కొని నిలబడిన అనుభవాన్ని యువీ అందరితో పంచుకున్నారు. అలాగే, హైదరాబాద్ తనకు ప్రత్యేకంగా ఇష్టమైన నగరం అని పేర్కొన్నారు. బ్రహ్మానందం మాట్లాడుతూ, పిల్లలను ఇతరులతో పోల్చడం వల్ల మానసిక ఒత్తిడి ఏర్పడుతుందని హితబోధ చేశారు. కార్యక్రమంలో యువీ బంతులు వేస్తే, సీవీ ఆనంద్ సరదాగా బ్యాటింగ్ చేసి అందరిని ఆనందపరిచారు.



















