ప్రగతి నగర్ పరిధిలోని KGR కన్వెన్షన్ సమీపంలో ఈరోజు రాత్రి భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. రాత్రి సుమారు 10 గంటల సమయంలో ఒక్కసారిగా మంటలు ఎగసిపడటంతో అక్కడి ఫర్నిచర్ దుకాణాలు అగ్నికి ఆహుతయ్యాయి. అర్థరాత్రి వరకు కొనసాగిన ఈ అగ్నిప్రమాదంలో సుమారు 40 ఫర్నిచర్ షాపులు దగ్ధమైనట్లు ప్రాథమిక సమాచారం. మంటలు వేగంగా వ్యాపించడంతో ఆ ప్రాంతమంతా దట్టమైన పొగతో కమ్ముకుని భయానక వాతావరణం నెలకొంది.
సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని పలు ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపులోకి తీసుకురావడానికి తీవ్రంగా శ్రమించారు. ఫర్నిచర్ దుకాణాల్లో చెక్క సామాగ్రి, ఫోమ్, ప్లైవుడ్ వంటి పదార్థాలు ఎక్కువగా ఉండటంతో మంటలు వేగంగా వ్యాపించినట్లు అధికారులు చెబుతున్నారు. ఈ ఘటనతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. అదృష్టవశాత్తూ ప్రాణ నష్టం జరగలేదని సమాచారం. అయితే కోట్ల రూపాయల ఆస్తి నష్టం జరిగి ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. అగ్నిప్రమాదానికి అసలు కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగి ఉండొచ్చని అనుమానం వ్యక్తమవుతోంది.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews



















