ఫ్లెమింగో ఫెస్టివల్ 2026 ఈరోజు నుంచి ప్రారంభమై మూడు రోజుల పాటు సందర్శకులను అలరించనుంది. ఉత్సవాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు ప్రభుత్వం సమగ్ర ఏర్పాట్లు చేసిందని తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ తెలిపారు. సందర్శకులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా రవాణా, భద్రత, మౌలిక వసతులు సిద్ధం చేశామని చెప్పారు. భద్రతా చర్యలను కట్టుదిట్టంగా అమలు చేస్తున్నామని, స్థానికులకు ఉపాధి అవకాశాలు కల్పించేలా ప్రత్యేక చర్యలు తీసుకున్నామని పేర్కొన్నారు. 15 ఏళ్లలోపు పిల్లలకు ఉచిత బోటింగ్ సౌకర్యం కల్పిస్తున్నట్లు తెలిపారు. ఫ్లెమింగో ఫెస్టివల్ విద్యార్థులకు జ్ఞానాన్ని, పర్యాటకులకు ఆనందాన్ని అందించే వేదికగా నిలుస్తుందని కలెక్టర్ అన్నారు.



















