ఇద్దరు కథానాయికలతో కలిసి శర్వానంద్ ఈ సంక్రాంతికి ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నారు. రామ్ అబ్బరాజు దర్శకత్వంలో ఆయన కథానాయకుడిగా నటించిన చిత్రం ‘నారీ నారీ నడుమ మురారి’ జనవరి 14న విడుదల కానుంది. ఈ సందర్భంగా తాజాగా ‘ఈ నారీ ఆ నారీ నడుమనే మురారి..’ అంటూ సాగే వీడియో సాంగ్‌ను చిత్రబృందం విడుదల చేసింది. ఈ పాటకు రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించగా, అరవింద్ గానం చేశారు. ఈ చిత్రంలో శర్వానంద్‌కు జోడిగా సంయుక్త, సాక్షి వైద్య నటిస్తున్నారు.




















