భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం 2026 జూన్ నుంచి ప్రారంభం కానుండగా, ఉత్తరాంధ్ర రవాణా వ్యవస్థకు కొత్త దిశ చూపనుంది. మూలపేట పోర్ట్ ప్రారంభంతో సముద్ర వాణిజ్యం వేగం పుంజుకోనుంది. ఐటీ రంగంలో టీసీఎస్, గూగుల్ ఏఐ డేటా హబ్, రిలయన్స్, మెటా, ఇన్ఫోసిస్ వంటి సంస్థల రాకతో విశాఖ ఐటీ హబ్‌గా మారుతోంది. రిటైల్, హాస్పిటాలిటీ రంగాల్లో లూలూ మాల్, ఇనార్బిట్, ఏఎస్‌ఎన్ మెగా మాల్‌లు, తాజ్, ఒబెరాయ్ వంటి హోటళ్లతో నగరం వేగంగా అభివృద్ధి చెందుతోంది.



















