ఆంటోనీ వర్గీస్, కబీర్ దుహాన్ సింగ్, సునీల్ కీలక పాత్రల్లో నటిస్తున్న మలయాళం చిత్రం ‘కాటాలన్’. పాల్ జార్జ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాను పాన్ ఇండియా స్థాయిలో మే నెలలో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ప్రమోషన్స్‌లో భాగంగా శుక్రవారం ‘కాటాలన్’ టీజర్‌ను విడుదల చేశారు. ఏనుగు దంతాల అక్రమ రవాణా నేపథ్యంలో ఈ సినిమా కథ సాగనుంది.



















