మంగళగిరి నియోజకవర్గంలో నిర్వహించిన క్రీడా పోటీల్లో నారా లోకేష్ ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన స్వయంగా క్రికెట్ బ్యాట్ పట్టి గ్రౌండ్‌లో సిక్సర్లు, ఫోర్లతో అలరించారు. క్రీడాకారులను ఉత్సాహపరుస్తూ వారితో కలిసి సరదాగా గడిపారు. లోకేష్‌ను చూసేందుకు స్థానిక ప్రజలు, యువత పెద్ద ఎత్తున తరలివచ్చారు. ప్రజల మధ్యకు వెళ్తూ, వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకుంటూ లోకేష్ అందరినీ ఆకట్టుకున్నారు. క్రీడల పట్ల యువతకు ఉన్న ఆసక్తిని పెంపొందించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం సాగింది.


















