దుల్కర్ సల్మాన్ కథానాయకుడిగా పవన్ సాధినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘ఆకాశంలో ఒక తార’. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ వేగంగా కొనసాగుతోంది. తాజాగా ఈ చిత్రంలో హీరోయిన్‌ను అధికారికంగా పరిచయం చేస్తూ గ్లింప్స్‌ను విడుదల చేశారు. సాత్విక వీరవల్లి ఈ చిత్రంలో కథానాయికగా నటిస్తున్నట్లు చిత్రబృందం వెల్లడించింది. కనీస సౌకర్యాలు లేని పల్లెటూరిలో జన్మించిన ఓ అమ్మాయి తన కలలను ఎలా సాకారం చేసుకుందో చూపించే కథాంశంతో ఈ సినిమా రూపొందుతున్నట్లు గ్లింప్స్ ద్వారా తెలుస్తోంది. వేసవి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.



















