“సార్, సమయం అయిపోయింది… మీకు కాల్స్ కూడా వస్తున్నాయి, వెళ్దాం సార్” అని అధికారులు సూచించినా, “ఉండండి, పిల్లలు వస్తున్నారు” అంటూ అక్కడే నిలిచారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. వచ్చిన ప్రతి విద్యార్థినిని ఆత్మీయంగా పలకరిస్తూ, వారితో కలిసి ఫొటోలు దిగుతూ తన సరళతను, విద్యార్థులపై ఉన్న ప్రేమను మరోసారి చాటుకున్నారు.



















