మాజీ ప్రియురాలిని మర్చిపోలేక మనో వేదనతో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ‘నేను జీవితంలో ఎన్నో తప్పులు చేశాను, ఇక మళ్లీ చేయను’ అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టి అతను (సినీనటికి కాబోయే భర్త) ఆత్మహత్య చేసుకున్నాడు.
మృతుడు నటికి కాబోయే భర్త
హైదరాబాద్: మాజీ ప్రియురాలిని మర్చిపోలేక మనో వేదనతో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ‘నేను జీవితంలో ఎన్నో తప్పులు చేశాను, ఇక మళ్లీ చేయను’ అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టి అతను (సినీనటికి కాబోయే భర్త) ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, రాజస్థాన్(Rajastan)కు చెందిన ఓ సినీనటికి ఇన్‌స్టాగ్రామ్(Instagram) ద్వారా సవాయి సింగ్ పరిచయం అయ్యాడు. గత జూలైలో ఇద్దరికీ నిశ్చితార్థం జరిగింది.
ఇద్దరూ జూబ్లీహిల్స్(Jubli Hills) ప్రశాసన్‌నగర్‌లో ఉంటున్నారు. ఈనెల 27న సవాయి సింగ్, సినీ నటి విధులకు వెళ్లారు. అయితే, సవాయిసింగ్ తిరిగి ఫ్లాట్‌కు వెనుక ద్వారం నుంచి లోపలికి వచ్చి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మరణానికి ముందే ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియో(Video) పోస్ట్ చేశాడు.
సాయంత్రం షూటింగ్ విధులు ముగించుకుని ఇంటికి చేరుకున్న నటి భోజనశాలలో సవాయిసింగ్ చనిపోయి ఉండడాన్ని చూసింది. అయితే, మృతుడికి మాజీ స్నేహితురాలితో ఉన్న ఆర్థిక వివాదాలే ఈ ఘటనకు కారణం అయి ఉండవచ్చని అనుమానం వ్యక్తమవుతోంది. జూబ్లీహిల్స్ పోలీసులు(Jubli Hills Police) కేసు దర్యాప్తు చేస్తున్నారు.


















