రాజుగారి పెళ్లి ఏడుతరాలు గుర్తుండిపోతుందంటూ నవ్వులు పూయిస్తున్న నవీన్ పొలిశెట్టి ప్రధాన పాత్రలో నటించిన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘అనగనగా ఒక రాజు’ ప్రేక్షకులను ఆకట్టుకోనుంది. ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి కథానాయికగా కనిపించనుండగా, సూర్యదేవర నాగవంశీ మరియు సాయి సౌజన్య కలిసి నిర్మిస్తున్నారు. సంక్రాంతి కానుకగా జనవరి 14న థియేటర్లలో విడుదలకు సిద్ధమైన ఈ సినిమా ట్రైలర్‌ను తాజాగా విడుదల చేశారు. ట్రైలర్‌లో నవీన్ పొలిశెట్టి తన ప్రత్యేకమైన కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకులను మెప్పిస్తున్నారు.




















