రామ్ పోతినేని నటించిన ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ సినిమా థియేటర్లలో విజయవంతంగా అలరిస్తోంది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ ‘పప్పీ షేమ్’ పాట ఫుల్ వీడియోని విడుదల చేసింది. ప్రత్యేకత ఏమిటంటే.. ఈ సాంగ్‌ను స్వయంగా హీరో రామ్ పాడారు. భాస్కర భట్ల రచనలో, వివేక్–మెర్విన్ ఇచ్చిన సంగీతంతో ఈ పాట ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.




















