అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో రహదారుల మరమ్మతులకు రాష్ట్ర ప్రభుత్వం భారీగా నిధులు కేటాయించింది. మొత్తం రూ.1,000 కోట్లు 274 రహదారుల పునరుద్ధరణకు మంజూరు చేసింది.
ఈ మేరకు ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎం.టి. కృష్ణబాబు పాలనాపరమైన అనుమతులతో కూడిన ఉత్తర్వులు జారీ చేశారు. ఇందులో స్టేట్ హైవేల్లో 108 పనులకు రూ.400 కోట్లు, అలాగే జిల్లా రహదారుల మరమ్మతులకు 166 పనులకు రూ.600 కోట్లు కేటాయించినట్లు తెలిపారు.



















