ఈనాడు, అమరావతి: అక్టోబరు 4న సుమారు 2.90 లక్షల మంది ఆటో డ్రైవర్లకు రూ.15 వేల చొప్పున కూటమి ప్రభుత్వం అందించబోతోందని తెదేపా ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ తెలిపారు. ఈ పథకం అమలుకు రూ.435 కోట్లు కేటాయించిందన్నారు. మంగళగిరిలోని తెదేపా కేంద్ర కార్యాలయంలో మంగళవారం నసీర్ అహ్మద్ విలేకర్లతో మాట్లాడారు.

















