ShivaSakthi News
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
ShivaSakthi News
No Result
View All Result
ShivaSakthi News
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు

ఏపీలో ఎయిర్‌బస్‌ కేంద్రం నెలకొల్పండి

October 1, 2025
in Andhra Pradesh News, Politics News
0
ఏపీలో ఎయిర్‌బస్‌ కేంద్రం నెలకొల్పండి
Share on FacebookShare on TwitterShare on Whatsapp

వాణిజ్య విమానాలు, డిఫెన్స్, స్పేస్, హెలికాప్టర్ల తయారీలో ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఎయిర్‌బస్‌ను మంత్రి నారా లోకేశ్‌ ఆంధ్రప్రదేశ్‌కు ఆహ్వానించారు. రాష్ట్రంలో తయారీ కేంద్రం ఏర్పాటు చేయాలని కోరారు. దాదాపు రూ.16 లక్షల కోట్ల విలువైన వ్యవస్థను నడుపుతున్న ఆ సంస్థ పాలకమండలి భారత్‌లో తయారీకి ఉన్న అవకాశాల గురించి అన్వేషించడానికి తొలిసారి ఇక్కడికి వచ్చింది. ఎయిర్‌బస్‌ ఛైర్మన్‌ రెనె ఓబెర్మన్‌తోపాటు, ఆ సంస్థ ఇండియా, దక్షిణాసియా ప్రెసిడెంట్, మేనేజింగ్‌ డైరెక్టర్‌ల ఆధ్వర్యంలో భారత్‌కు వచ్చిన పాలకమండలిని కలిసేందుకు లోకేశ్‌ దిల్లీకి వచ్చారు. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె.రామ్మోహన్‌నాయుడితో కలిసి మంగళవారం వారితో భేటీ అయ్యారు. ఆంధ్రప్రదేశ్‌లోని వనరులు, పెట్టుబడుల అవకాశాల గురించి వివరించారు. రాష్ట్రంలో ప్రపంచస్థాయి ఏరోస్పేస్‌ తయారీ కేంద్రంతోపాటు అనుబంధ సప్లై చైన్‌ సులభంగా ఏర్పాటు చేసుకోవడానికి ఉన్న అవకాశాల గురించి ప్రజంటేషన్‌ ఇచ్చారు.  

సమీకృత కేంద్రం ఏర్పాటు చేయండి

ఆంధ్రప్రదేశ్‌లో సమీకృత కేంద్రం (ఇంటిగ్రేటెడ్‌ క్లస్టర్‌) ఏర్పాటు చేయాలని లోకేశ్‌ ఎయిర్‌బస్‌ బోర్డుకు విజ్ఞప్తి చేశారు. ప్రధాన వ్యవస్థతోపాటు సరఫరాదారులు, ఎంఎస్‌ఎంఈ, ఇతర భాగస్వామ్య పక్షాలు ఒకేచోట కార్యకలాపాలు నిర్వహించుకుంటే తక్కువ ఖర్చుతోనే నాణ్యమైన ఉత్పత్తులను తయారు చేయొచ్చన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో బహుళ ఏరోస్పేస్‌ కారిడార్లను అభివృద్ధి చేస్తున్నామని, వాటిలో తమ అవసరాలకు తగ్గట్టు ఇష్టమైన వాటిని ఎంచుకోవచ్చని చెప్పారు. అందుబాటులో ఉన్న స్థలాల్లో దేన్నయినా ఎంచుకొనే స్వేచ్ఛ ఇస్తామన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు బ్రాండ్‌ ఇమేజ్, ట్రాక్‌ రికార్డు గురించి వారికి తెలిపారు. విభిన్న రంగాల నుంచి ప్రపంచస్థాయి పెట్టుబడులను ఆకర్షిస్తున్నట్లు వివరించారు. స్పీడ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌ నినాదంతో ఏపీ ప్రభుత్వం వేగంగా అనుమతులు ఇస్తోందన్నారు. 

AP301025main 6a ఏపీలో ఎయిర్‌బస్‌ కేంద్రం నెలకొల్పండి
image 2 ఏపీలో ఎయిర్‌బస్‌ కేంద్రం నెలకొల్పండి

ఎయిర్‌బస్‌ ఛైర్మన్‌ రెనె ఓబెర్మన్‌తో మంత్రి లోకేశ్‌ కరచాలనం

ఏపీ అన్ని రకాలా అనుకూలం 

ఎయిర్‌బస్‌ తయారీ యూనిట్‌ ఏర్పాటుకు ఆంధ్రప్రదేశ్‌ అన్ని రకాలుగా అనుకూలంగా ఉన్నట్లు మంత్రి లోకేశ్‌ సమావేశానంతరం ఒక ప్రకటనలో తెలిపారు. ‘ప్రపంచ ఏరోస్పేస్‌ రంగంలో అత్యున్నత నాణ్యతా ప్రమాణాలకు ఎయిర్‌బస్‌ చిహ్నం. సంక్లిష్టమైన దాని తయారీకి అవసరమైన పూర్తిస్థాయి వసతులు కల్పించడానికి ఆంధ్రప్రదేశ్‌ సంసిద్ధంగా ఉంది’ అని ప్రకటించారు. కేంద్రమంత్రి రామ్మోహన్‌నాయుడు మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేశ్‌ల ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం మంచి విధానాలు రూపొందించి, పెట్టుబడులను ఆకర్షించడానికి వేగంగా ప్రయత్నిస్తోందన్నారు.

సిద్ధంగా భూములు

ఎయిర్‌బస్‌ ఆంధ్రప్రదేశ్‌ వైపు మొగ్గు చూపితే అంతా సిద్ధం చేసిన భూమిని ఇస్తామని, దానివల్ల వెంటనే (ప్లగ్‌ అండ్‌ ప్లేలో) కార్యకలాపాలు ప్రారంభించుకోవచ్చని లోకేశ్‌ వివరించారు. ఎయిర్‌పోర్టులు, పోర్టులు, లాజిస్టిక్స్‌కు అనుసంధానంగా ఉండే మల్టీకారిడార్లు అందుబాటులో ఉంచుతామన్నారు. ఇప్పటికే ఏరోస్పేస్‌ పాలసీని సిద్ధం చేశామని, దీనివల్ల రాష్ట్రంలో మొదలుపెట్టబోయే ప్రాజెక్టులు వేగంగా ముందుకు సాగడానికి వీలవుతుందని పేర్కొన్నారు. ఎగుమతులకు అనువైన ఏరోస్పేస్‌ హబ్‌ను తీర్చిదిద్దడానికి ఆంధ్రప్రదేశ్‌లో అన్ని రకాల వనరులూ అందుబాటులో ఉన్నాయన్నారు.

ShareTweetSend
Previous Post

పూర్వోదయ నిధులు మంజూరు చేయండి

Next Post

లబ్ధి పొందనున్న ఆటో డ్రైవర్లు 2.90 లక్షలు

Related Posts

అర్హులైన ప్రతి విద్యార్థికి ‘తల్లికి వందనం’ సాయం: లోకేశ్‌ ఆదేశం
Andhra Pradesh News

అర్హులైన ప్రతి విద్యార్థికి ‘తల్లికి వందనం’ సాయం: లోకేశ్‌ ఆదేశం

June 17, 2026
నీట్‌ యూజీ రీ-ఎగ్జామ్‌ అభ్యర్థులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం
Andhra Pradesh News

నీట్‌ యూజీ రీ-ఎగ్జామ్‌ అభ్యర్థులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం

June 17, 2026
కూటమి రెండేళ్ల సందర్భంగా ఇంటింటి ప్రచారం: లోకేశ్‌ దిశానిర్దేశం
Andhra Pradesh News

కూటమి రెండేళ్ల సందర్భంగా ఇంటింటి ప్రచారం: లోకేశ్‌ దిశానిర్దేశం

June 17, 2026
సింగపూర్‌ నుంచి మలేసియాకు మంత్రి నారాయణ.. అధ్యయన పర్యటనకు ప్రభుత్వ అనుమతి
Andhra Pradesh News

సింగపూర్‌ నుంచి మలేసియాకు మంత్రి నారాయణ.. అధ్యయన పర్యటనకు ప్రభుత్వ అనుమతి

June 17, 2026
‘తాలీం-ఏ-హునర్’తో మైనారిటీ విద్యార్థులకు కొత్త భవిష్యత్
Andhra Pradesh News

‘తాలీం-ఏ-హునర్’తో మైనారిటీ విద్యార్థులకు కొత్త భవిష్యత్

June 15, 2026
ఉద్యోగుల సమస్యల పరిష్కారమే మా ప్రధాన ఎజెండా: ఏపీ ఎన్జీవో సంఘం
Andhra Pradesh News

ఉద్యోగుల సమస్యల పరిష్కారమే మా ప్రధాన ఎజెండా: ఏపీ ఎన్జీవో సంఘం

June 15, 2026
Next Post
కొత్త మలుపులతో మరింత రసవత్తరంగా మారుతున్న మాస్టర్‌చెఫ్

కొత్త మలుపులతో మరింత రసవత్తరంగా మారుతున్న మాస్టర్‌చెఫ్.

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

I agree to the Terms & Conditions and Privacy Policy.

Live Cricket Score

Live Cricket Scores

Career

  • Trending
  • Comments
  • Latest
meenam

రాశి ఫలాలు – మీనం

June 17, 2026
రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

October 3, 2025
పంచాంగం: 17 జూన్ 2026 (బుధవారం)

పంచాంగం: 17 జూన్ 2026 (బుధవారం)

June 17, 2026
రాశి ఫలాలు – మేషం

రాశి ఫలాలు – మేషం

June 17, 2026
కొత్త మలుపులతో మరింత రసవత్తరంగా మారుతున్న మాస్టర్‌చెఫ్

కొత్త మలుపులతో మరింత రసవత్తరంగా మారుతున్న మాస్టర్‌చెఫ్.

0
బంగ్లాదేశ్ జైలు నుంచి విడుదలైన భారత మత్స్యకారులు.. వారిలో 9 మంది విశాఖవాసులు

బంగ్లాదేశ్ జైలు నుంచి విడుదలైన భారత మత్స్యకారులు.. వారిలో 9 మంది విశాఖవాసులు.

0
మహారాష్ట్రలో విషాదం.. అజిత్ పవార్ ప్రయాణించిన విమానానికి ప్రమాదం

మహారాష్ట్రలో విషాదం.. అజిత్ పవార్ ప్రయాణించిన విమానానికి ప్రమాదం

0
ఏపీపీఎస్సీ గ్రూప్‌–2 తుది ఎంపిక జాబితా విడుదల.. 891 పోస్టులకు అభ్యర్థుల ఎంపిక.

APPSC గ్రూప్–2 తుది ఎంపిక జాబితా విడుదల | 891 పోస్టులకు ఎంపికైన అభ్యర్థులు

0
అమెరికా–ఇరాన్ శాంతి ఒప్పందం ప్రభావం: చమురు ధరలు తగ్గడంతో వరుసగా మూడో రోజూ దేశీయ మార్కెట్లకు లాభాలు

అమెరికా–ఇరాన్ శాంతి ఒప్పందం ప్రభావం: చమురు ధరలు తగ్గడంతో వరుసగా మూడో రోజూ దేశీయ మార్కెట్లకు లాభాలు

June 17, 2026
ఉత్తరాఖండ్‌లో అనుమానాస్పద పరిస్థితుల్లో ఐటీ ఉద్యోగిని మృతి; హోమ్‌స్టేలో ఘటన

ఉత్తరాఖండ్‌లో అనుమానాస్పద పరిస్థితుల్లో ఐటీ ఉద్యోగిని మృతి; హోమ్‌స్టేలో ఘటన

June 17, 2026
అమెరికాలో స్కైడైవింగ్ శిక్షణ విమానం కుప్పకూలి తెలుగు విద్యార్థి మృతి

అమెరికాలో స్కైడైవింగ్ శిక్షణ విమానం కుప్పకూలి తెలుగు విద్యార్థి మృతి

June 17, 2026
గోవా–హైదరాబాద్ డ్రగ్స్ రాకెట్‌ గుట్టురట్టు; కీలక నిందితులు అరెస్ట్‌

గోవా–హైదరాబాద్ డ్రగ్స్ రాకెట్‌ గుట్టురట్టు; కీలక నిందితులు అరెస్ట్‌

June 17, 2026

Recent News

ShivaSakthi.Net

Stay updated with the latest Telugu news, breaking stories, and trending updates from across Andhra Pradesh, Telangana, and the world. A one-stop platform for politics, cinema, business, sports, and more

Follow Us

Browse by Category

  • Andhra Pradesh News
  • Blog
  • Business News
  • Bussiness news
  • Crime News
  • Devotional News
  • Education
  • Entertainment News
  • Gold and Silver News
  • Health
  • India News
  • Lifestyle
  • Movies
  • News
  • Politics News
  • Rasi Phalalu
  • Recipes
  • Sports News
  • Stock Market News
  • Technology News
  • Telangana News
  • Telugu Stories
  • World News

Recent News

అమెరికా–ఇరాన్ శాంతి ఒప్పందం ప్రభావం: చమురు ధరలు తగ్గడంతో వరుసగా మూడో రోజూ దేశీయ మార్కెట్లకు లాభాలు

అమెరికా–ఇరాన్ శాంతి ఒప్పందం ప్రభావం: చమురు ధరలు తగ్గడంతో వరుసగా మూడో రోజూ దేశీయ మార్కెట్లకు లాభాలు

June 17, 2026
ఉత్తరాఖండ్‌లో అనుమానాస్పద పరిస్థితుల్లో ఐటీ ఉద్యోగిని మృతి; హోమ్‌స్టేలో ఘటన

ఉత్తరాఖండ్‌లో అనుమానాస్పద పరిస్థితుల్లో ఐటీ ఉద్యోగిని మృతి; హోమ్‌స్టేలో ఘటన

June 17, 2026
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2025 ShivaSakthi.Net

No Result
View All Result

© 2025 ShivaSakthi.Net

This website uses cookies. By continuing to use this website you are giving consent to cookies being used. Visit our Privacy and Cookie Policy.