అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల శివ” అనే పంచాక్షరిని తలచినంతనే సకల పాపాలు తొలగిపోతాయని, మోక్షం సిద్ధిస్తుందని భక్తులు ప్రగాఢంగా విశ్వసిస్తారు.
అరుణాచలం అనే పదంలో ‘అరుణ’ అంటే ఎర్రని లేదా తేజోవంతమైన అగ్ని అని, ‘అచలం’ అంటే కదలని కొండ అని అర్థం. తమిళంలో ‘తిరువన్నామలై’ అంటారు. ‘తిరు’ అంటే శ్రీ, ‘అణ్ణామలై’ అంటే అణగలేని లేదా పెద్ద కొండ అని అర్ధం. ఇక్కడ పరమశివుడు స్వయంగా ఒక కొండ రూపంలో ఆవిర్భవించాడని, ఆ కొండే శివలింగమని భక్తుల ప్రగాఢ నమ్మకం. అరుణాచలంలో అడుగుపెట్టడం ఎంతో పుణ్యం చేసుకుంటేనే సాధ్యమని, ఇక్కడ ప్రవేశించిన తర్వాత మనుషుల పాపపుణ్యాల లెక్క మారుతుందని భక్తులు నమ్ముతారు.




















