1. అశ్విని
శ్లోకం:
శ్లోII సదైవ దేవాభ్యుదితో వినీతః
సత్తన్వితః ప్రాప్త సమస్త సంపత్
యోషావిభూషాత్మజ భూరితోషః
స్యాదశ్వినీ జన్మని మానవస్య II
భావం:
వీరు ఎల్లప్పుడూ వినయం గలవారు, దైవభక్తి కలిగినవారు.
సత్త్వ గుణాలు ఎక్కువ, జీవితం సంపన్నంగా, సంతోషంగా ఉంటుంది.
2. భరణి
శ్లోకం:
శ్లోII సదాపకీర్తిః హి మహాపవాదః
నానా వినోదైశ్చ వినీత కాలః
జలేవిలాసీ చపలఃఖలు స్యాత్
ప్రాణిప్రణీతో భరణీషు జాతః II
భావం:
అనేక కష్టాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది.
వినోదం, వ్యసనాలు, చిత్తం చప్పలత్వం ఎక్కువ.
నీటి దగ్గరి కార్యాలు, జలప్రయాణాలు ఇష్టపడతారు.
3. కృత్తిక
శ్లోకం:
శ్లోII క్షుధాధికః సత్యధనైర్విహీనః
వృధాటనోత్పన్న మతిః కృతఘ్నః
కఠోరవాక్ చాహిత కర్మకృత్ స్యాత్
చేత్ కృత్తికాయం మనుజః ప్రసూతః II
భావం:
ఆకలి ఎక్కువ, సత్యం, ధనం లేనివారు.
వృధాటనం, కృతజ్ఞత లేకపోవడం, కఠినచిత్తత్వం, పాపకార్యాల్లో నైపుణ్యం.
4. రోహిణి
శ్లోకం:
శ్లోII స్యాద్ధర్మ కార్యే కుశలః కులీనః
సుచారుదేహో విలసత్కలేబరః
స్మరాగ్నినాకులితా ఖిలాశయో
యోరోహిణీజః సధనీ సమానీ II
భావం:
ధర్మకార్యాలలో నైపుణ్యం, అందమైన శరీరం, శృంగారభావాలు ఎక్కువ.
ప్రేమలో విశ్వాసం, ధనవంతులు, అభిమాన వంతులు.
5. మృగశిర
శ్లోకం:
శ్లోII శరాసనాభ్యాస రతో వినీతః
సదానురక్తో గుణినాంగుణేషు
భక్తానుపస్నేహ భరేణ పూర్ణః
సన్మార్గవర్తీ మృగజన్మ భాగీ II
భావం:
ఏకాగ్రత, సాంకేతిక విజ్ఞానం, మంచి గుణాలపై ఆసక్తి, స్నేహశీలత, వినయం మరియు సన్మార్గ ప్రవర్తన.
6. ఆర్ద్ర
శ్లోకం:
శ్లోII క్షుధాధికో లక్ష్మ శరీర కాంతిః
కలిప్రియః కోపోయుతో వినీతః
ప్రసూతికాలేచ భవేత్ కిలార్ద్రా
సచార్ద్రచేతాః శరణాగతే పి II
భావం:
ఆకలి ఎక్కువ, శరీరం కాంతిమయంగా ఉంటుంది.
చెడు పనుల్లో ఆసక్తి, కోప స్వభావం, వినయం, ప్రతీకారం.
7. పునర్వసు
శ్లోకం:
శ్లోII ప్రభూత మిత్రః కృతశాస్త్ర యత్నః
సద్రత్నకామీ వరభూషణాఢ్యః
దాతాప్రతాపీ వసుధాధిప శ్రీః
పునర్వసౌయస్య భవేత్ప్రసూతిః II
భావం:
అనేక స్నేహితులు, విద్యలో నేర్పరితనం, మంచి వస్తువుల కోసం ఆసక్తి, దాన ధర్మం, ధైర్యం, మంచి ఉద్యోగం సాధన.
8. పుష్యమి
శ్లోకం:
శ్లోII ప్రసన్న గాత్రః పితృమాతృభక్తః
స్వధర్మయుక్తో వినయాభియుక్తాః
భవేన్మనుష్యఃఖలు పుణ్యజన్మా
సమ్మానచామీకర వాహనాఢ్యః
భావం:
అందమైన శరీరం, తల్లిదండ్రుల పట్ల భక్తి, కర్తవ్యం, వినయం, పేరుప్రతిష్టలు, వాహన సౌభాగ్యం.
9. ఆశ్లేష
శ్లోకం:
శ్లోII వృధాటనః స్యాదతి దుష్టచేతః
కష్టప్రదస్యాపి వృధా జనానాం
సర్వేసదర్పోహి శఠార్పితార్థః
కందర్ప సంతప్త మనా మనుష్యః II
భావం:
వృధాటనం, చెడుగుణాలు, అసూయ, కష్టభరిత జీవితం, గర్వం, కామవాంఛ అధికం.
10. మఖ
శ్లోకం:
శ్లోII కఠోరచిత్తః పితృమాతృభక్తః
తీవ్ర స్వభావః అనవద్య విద్యః
చేజ్జన్మభంయస్య మఘానఘః స్యా
-న్మతి సదారాతి వినాశ దక్షా II
భావం:
కఠినచిత్తులు, తల్లిదండ్రుల పట్ల భక్తి, కోపం, మంచి విద్య, శత్రువిజయం.
11. పుబ్బ
శ్లోకం:
శ్లోII శూరస్త్యాగీ సాహసీ భూమిభర్తా
కోపాక్రాంతః స్యాచ్ఛిరాలో తిదక్షః
ధూర్తః క్రూరోఽ త్యంత వాతాధికఃప్రాక్
ఫల్గున్యశ్చేజ్జన్మ కాలేచ యస్య II
భావం:
ధైర్యం, త్యాగ గుణం, మంచి ఉద్యోగం, కోప స్వభావం, కార్యకౌశల్యం, కొంచెం క్రూర స్వభావం.
12. ఉత్తర ఫల్గుని
శ్లోకం:
శ్లోII దాతా దయాళుః స్వజనే సుశీలః
విశాలకీర్తిః సుమతి ప్రధానః
ధీరోనరో త్యంత మృదుస్వభావః
స్యాదుత్తరా ఫల్గునికా ప్రసూతిః II
భావం:
దానగుణం, దయ, తనవారి పట్ల ప్రేమ, గొప్ప కీర్తి, తెలివి, ధైర్యం, అత్యంత మృదుస్వభావం.
13. హస్త
శ్లోకం:
శ్లోII దాతాయశస్వీ సుతరాం మనస్వీ
భూదేవ దేవార్చన కృన్న యజ్ఞః
ప్రసూతికాలే కిల యస్య హస్తా
హస్తస్థితా తస్య సమస్త సంపత్ II
భావం:
దానగుణం, కీర్తి, అభిమానము, సత్కార్యాలు, యజ్ఞాలు, దేవాలయలో అర్చన.
అధిక సంపద కలిగినవారు.
14. చిత్త
శ్లోకం:
శ్లోII ప్రతాపసంతాహిత శతృపక్షః
దక్షోనయే చాపి విచిత్రవాసాః
ప్రసూతికాలే యదితస్య చిత్రా
బుద్ధిర్విచిత్రా ఖలుతస్య శాస్త్రే II
భావం:
కార్యసాధనలో విజయం, ధైర్యం, రాజకీయ నైపుణ్యం, వస్త్రాలపై ఇష్టం, బుద్ధికుశలత, గ్రంథ పరిచయం ద్వారా జ్ఞానం.
15. స్వాతి
శ్లోకం:
శ్లోII కందర్పరూప ప్రభయా సమేతః
కాంతాజన ప్రీతిరతి ప్రసన్నః
స్వాతి ప్రసూతౌయది
మహామతిః ప్రాప్త విభూతియోగః II
భావం:
అందం, స్త్రీలలో ఇష్టం, ప్రసన్నమైన స్వభావం, తెలివి, సంపద.
16. విశాఖ
శ్లోకం:
శ్లోII సదానురక్తో వివిధ క్రియాయాం
సువర్ణకారైరపి సఖ్యమేతి
యస్యప్రసూతౌ చ భవేద్విశాఖా
సఖాన కస్యాపి భవేత్ప్రసూతః II
భావం:
అనేక పనుల్లో నైపుణ్యం, బంగారు వ్యాపారులతో పరిచయం, గొప్ప ఉద్యోగాలలో స్థానం, అందరికీ ఇష్టపడే స్వభావం.
17. అనురాధ
శ్లోకం:
శ్లోII సత్ కీర్తి కాంతిశ్చ సదోత్సవః స్పాత్
జేతారిపూణాంచ కళాప్రవీణః
స్యాత్సంభవే యస్య కిలానురాధః
సంపత్ ప్రమాదౌ వివిధౌ భవేతాం II
భావం:
మంచి కీర్తి, సుఖం, కళలలో నైపుణ్యం, అనేక కష్టాలు, దీర్ఘాయువు.
18. జ్యేష్ఠ
శ్లోకం:
శ్లోII సత్ కీర్తి పుత్రైః వివిధైః సమేతః
విత్తాన్వితో త్యంత లసత్ప్రతాపః
శ్రేష్ట ప్రతిష్ఠో వికలస్వభావో
జ్యేష్ఠా భవేద్యస్యచ జన్మకాలేII
భావం:
మంచి కీర్తి, సంతాన సమృద్ధి, సంపద, కార్యనైపుణ్యం, కొంత దుష్ట స్వభావం.
19. మూల
శ్లోకం:
శ్లోII మూలం విరుద్ధావయవం సమూలం
కులందహత్యేవ వదంతి సంతః
చేదన్యథాతః పురుషా విశేషాత్
సౌభాగ్యమాయుశ్చ కులానువృద్ధిః II
భావం:
వికలంగా జన్మిస్తే, వంశం నశిస్తుంది.
శుభలక్షణాల ఉంటే, సౌభాగ్యం, ఆయువు, వంశవృద్ధి.
20. పూర్వాషాఢ
శ్లోకం:
శ్లోII భూయో భూయాస్తూయ మానాను రక్తః
భక్తోదేవే బంధుమాన్యో తి దక్షః
పూర్వాషాఢాం జన్మకాలే యదిస్యాత్
ఆషాఢః స్యాత్ వైరివర్గే నితాంతమ్
భావం:
చుట్టుపక్కల గౌరవం పొందే, భక్తి, బంధువుల గౌరవం, కార్యసాధనలో నేర్పరి.
21. ఉత్తరాషాఢ
శ్లోకం:
శ్లోII దాతాదయావాన్ విజయీ వినీతః
సత్కర్మచేత విభావైస్సమేతః
కాంతా సుఖావాప్త సుఖోనితాంతః
వేషే సువేషః పురుషో మనిషీII
భావం:
దయ, దాతృత్వం, వినయం, జయము, మంచి కర్మలు, సంపద, కుటుంబ సుఖం, గొప్ప కీర్తి.
22. శ్రవణం
శ్లోకం:
శ్లోII శాస్త్రానురక్తో బహుపుత్రమిత్రః
సత్పుత్రభక్తిః విజితారి వర్గః
చేజ్జన్మకాలే శ్రవణాహియస్య
ప్రేమా పురాణ శ్రవణే ప్రవీణః II
భావం:
వివిధ విషయాల్లో ఆసక్తి, పుత్రులు, మిత్రులు ఎక్కువ, శత్రుజయం, ప్రాచీన గాధల్లో ఇష్టం.
23. ధనిష్ఠ
శ్లోకం:
శ్లోII ఆచార జాతాదర చారుశీలః
ధీశాలి సోదరబలవాన్ దయాలుః
యస్యప్రసూతౌ చ భావేద్ధనిష్ఠా
మహాత్ప్రతిష్ఠా సహితో నరం స్యాత్ II
భావం:
సంప్రదాయంపై విశ్వాసం, తెలివి, సోదరుల సహాయం, గొప్ప కీర్తి, ప్రతిష్ఠ.
24. శతభిషం
శ్లోకం:
శ్లోII శతభీతిరతి సాహసీ సదా
నిష్ఠురోహి చతురో నరస్యాత్
వైరిణామతి శయేన దారుణో
వారుణోడు యదియస్య సంభవే II
భావం:
భయాలు, సాహసం, నిష్టూరత, తెలివి, శత్రుజయం.
25. పూర్వాభాద్ర
శ్లోకం:
శ్లోII జితేంద్రియః సర్వకలాసు దక్షః
జితారి పక్షః ఖలుతస్య నిత్యం
భవేన్మహీయాన్ సుతారాం అపూర్వా
పూర్యాదా భాద్రపదాప్రసూతౌ II
భావం:
ఇంద్రియ నియంత్రణ, కార్యనైపుణ్యం, శత్రుజయం, కష్టభరిత జీవితం.
26. ఉత్తరాభాద్ర
శ్లోకం:
శ్లోII ధనీ కులీనః కుశలః క్రియాదౌ
భూపాల మన్యో బలవాన్ మహౌజాః
సత్కర్మకర్తా నిజబంధు భక్తః
యదురాభద్ర పదా ప్రసూతః II
భావం:
ధనం, గొప్ప వంశం, కార్యనైపుణ్యం, బంధు ప్రేమ, మంచి స్వభావం.
27. రేవతి
శ్లోకం:
శ్లోII చారుశీల విభవో జితేంద్రియః
సత్ కులః స్వభవనైక మానసః
మానవో నను భవేన్మహీపతిః
రేవతీ భవతి యస్య జన్మభమ్ II
భావం:
చారుశీల, ఇంద్రియ నియంత్రణ, సదాచారం, ఇంటిలో స్థిరంగా ఉండే ఇష్టం, ఉన్నత స్థాయి జీవితం.




















