ఈరోజు (13-01-2026)
గురుబలం అనుకూలంగా రక్షిస్తోంది. దైవానుగ్రహంతో చేపట్టిన పనులు సజావుగా పూర్తి అవుతాయి. స్వల్ప ప్రయత్నంతోనే ఉద్యోగంలో మంచి ఫలితాలు పొందుతారు. ఒక శుభవార్త మీ ఇంట ఆనందాన్ని నింపుతుంది. మహాలక్ష్మి దర్శనం శుభఫలితాలను ఇస్తుంది.
ఈ వారం (11-01-2026 – 17-01-2026)
ఈ వారం విజయానికి అనుకూలంగా ఉంటుంది. లభించిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటే మంచి ఫలితాలు అందుకుంటారు. ఆర్థికంగా ధనయోగం బలంగా కొనసాగుతుంది. ఉద్యోగంలో అభివృద్ధి, గౌరవం పెరుగుతాయి. కుటుంబంలో శుభకార్యాల వాతావరణం కనిపిస్తుంది. వ్యాపారంలో సమయస్ఫూర్తితో తీసుకునే నిర్ణయాలు లాభదాయకంగా ఉంటాయి. శ్రీమహాలక్ష్మి ధ్యానం శుభప్రదంగా ఉంటుంది.



















