మానవ జీవనానికి అవసరమైన ఆహారం, వస్త్రాలు, ఔషధాలు మొదలైనవన్నీ మొక్కల నుంచే పొందుతున్నాం. ఈ మొక్కలు, వాటి ఉత్పత్తుల ఆర్థిక ప్రయోజనాలను శాస్త్రీయంగా అధ్యయనం చేసే విభాగమే ఆర్థిక వృక్షశాస్త్రం. ఇది ఆహార మరియు వాణిజ్య పంటల ఆర్థిక ప్రాముఖ్యతను తెలియజేసి, వాటి అభివృద్ధి కోసం తీసుకోవాల్సిన చర్యలను సూచిస్తుంది. అలాగే పర్యావరణ పరిరక్షణ, నేలల సుస్థిర వినియోగానికి అవసరమైన ప్రణాళికలు రూపొందించడంలో సహాయపడుతుంది. ఈ నేపథ్యంలో మొక్కల ప్రాథమిక అంశాలు, సహజ ఆహార పదార్థాల్లోని పోషక విలువలపై పోటీ పరీక్షల అభ్యర్థులు అవగాహన కలిగి ఉండటం అవసరం.




















