తన సినిమాటిక్ యూనివర్స్ నుంచి ప్రతి సంవత్సరం ఒక సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుందని ప్రసిద్ధ దర్శకుడు ప్రశాంత్ వర్మ ఇప్పటికే చెప్పేశారు. అందులో భాగంగా రాబోతున్న మూడవ చిత్రం ‘మహాకాళి’. ఇది ఫీమేల్ సూపర్‌హీరోగా రూపొందుతున్న చిత్రం. కథను ప్రశాంత్ వర్మ అందించగా, దర్శకత్వ బాధ్యతను పూజ అపర్ణ కొల్లూరు వహిస్తున్నారు.
తాజాగా, ఈ సినిమాలో మహాకాళిగా కన్నడ నటి భూమి శెట్టి నటించనున్నారు అని అధికారంగా తెలిపారు. ‘‘విశ్వంలోనే అత్యంత శక్తిమంతమైన సూపర్‌హీరో రాబోతున్నారు’’ అంటూ ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. భూమి శెట్టి ఇటీవల ‘కింగ్డమ్’ సినిమాలో సత్యదేవ్ భార్యగా ఆకట్టుకున్నారు.
‘మహాకాళి’ షూటింగ్ ఇప్పటికే 50 శాతం పూర్తి కాగా, ప్రస్తుతంలో హైదరాబాద్‌లో ప్రత్యేకంగా నిర్మించిన సెట్‌లో చిత్రీకరణ జరుగుతోంది. ఇందులో బాలీవుడ్ నటుడు అక్షయ్ ఖన్నా శుక్రాచార్యుడిగా నటిస్తున్నారు. గతంలో ప్రశాంత్ వర్మ మాట్లాడుతూ, ‘‘మా యూనివర్స్‌లో కొత్త శక్తి జోడించబడింది. అత్యంత భయంకరమైన చెడుపై యుద్ధం చేయడానికి కాళికాదేవి స్వరూపం రాబోతోంది. సూపర్‌హీరోలు ఎలా ఉంటారో ఈ చిత్రంలో చూపించనున్నాం’’ అన్నారు.




















