ఇంటర్నెట్ డెస్క్: భారత స్టార్ ఆటగాడు, మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ 37వ ఏడాదిలోకి అడుగుపెట్టాడు. విరాట్ ఇప్పుడు కేవలం వన్డేల్లోనే ఆడుతోన్న సంగతి తెలిసిందే. అంతర్జాతీయంగా కింగ్ కోహ్లీగా పేరొందిన అతడికి ఐపీఎల్ ఫ్రాంచైజీ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ప్రత్యేకంగా శుభాకాంక్షలు చెబుతూ పోస్టు పెట్టింది. గత సీజన్‌లో ఆర్సీబీ ఐపీఎల్ విజేతగా నిలిచింది.
‘‘హ్యాపీ బర్త్‌డే టు ది కింగ్. ది రన్ మెషీన్. ది ఛేజ్ మాస్టర్. ది గోట్ విరాట్ ప్రేమ్ కోహ్లీ. నీ వల్లే ఆటకు మరింత విలువ పెరిగింది. లిటిల్ విరాట్ కలలు కన్నాడు. కింగ్ కోహ్లీలా మారాడు. అతడి గొప్పదనం ఏంటో ప్రపంచమంతా చూసింది’’ అని ఆర్సీబీ పోస్టు పెట్టింది. ఇందులో ఓ వీడియోను జత చేసింది.
విరాట్ కోహ్లీ జన్మదినం సందర్భంగా జియో హాట్‌స్టార్ కూడా తన విషెస్ తెలిపింది. నమ్మకాన్ని అద్భుతంగా మార్చిన వ్యక్తి విరాట్. ది ఛేజ్ మాస్టర్‌కు జన్మదిన శుభాకాంక్షలు’’ అని పేర్కొంది.




















