అమరావతి:
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈరోజు టీడీపీ కేంద్ర కార్యాలయాన్ని సందర్శించారు. పార్టీ కార్యకలాపాలు, అభివృద్ధి పనులు, మరియు ప్రజల సమస్యలపై సమీక్ష నిర్వహించనున్నట్లు సమాచారం.
ముఖ్యమంత్రి చంద్రబాబు, ప్రజల నుంచి నేరుగా వినతులు స్వీకరించనున్నారు. పార్టీ కార్యాలయ ప్రాంగణంలో ప్రజలు, కార్యకర్తలు తమ సమస్యలను నేరుగా ఆయనకు తెలియజేయనున్నారు.
అదే సమయంలో, కార్యాలయం వద్ద జరుగుతున్న అభివృద్ధి పనులను సీఎం స్వయంగా పరిశీలించారు. పనుల ప్రగతిపై అధికారులు, నిర్వాహకుల నుండి వివరాలు తెలుసుకున్నారు.
తదుపరి కార్యక్రమంలో, అందుబాటులో ఉన్న పార్టీ నేతలతో భేటీ అవుతారు. ఈ సమావేశంలో పార్టీ భవిష్యత్ వ్యూహాలు, పార్లమెంట్ అధ్యక్షులు మరియు పార్టీ పదవుల నియామకాలపై కీలక చర్చలు జరగనున్నాయి.
టీడీపీ భవిష్యత్ కార్యాచరణపై స్పష్టత ఇవ్వడమే కాకుండా, ప్రజా సేవా దిశగా పార్టీని మరింత చురుకుగా ముందుకు తీసుకెళ్లే మార్గసూచనలు చంద్రబాబు అందించనున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.



















