ఆంధ్రప్రదేశ్‌లో గత 20 నెలల కాలంలో వివిధ రంగాల్లో కలిపి మొత్తం 6,28,327 ఉద్యోగాలు కల్పించినట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో వెల్లడించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన ఉద్యోగ హామీలను అమలు చేస్తూ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించామని ఆయన తెలిపారు. ప్రభుత్వ చర్యల ఫలితంగా పరిశ్రమలు, సేవారంగం, నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాల ద్వారా పెద్ద సంఖ్యలో ఉద్యోగాలు ఏర్పడ్డాయని వివరించారు.
రంగాల వారీగా చూస్తే సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు (MSME) రంగంలో 2,48,906 ఉద్యోగాలు కల్పించగా, నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు మరియు జాబ్ మేళాల ద్వారా 1,46,627 మందికి ఉపాధి అవకాశాలు లభించాయి. పరిశ్రమల రంగంలో 95,174 ఉద్యోగాలు, ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో 64,035 ఉద్యోగాలు కల్పించారు. అదేవిధంగా మెగా డీఎస్సీ, పోలీస్ కానిస్టేబుల్ నియామకాలతో సహా ప్రభుత్వ రంగంలో 30,592 ఉద్యోగాలు భర్తీ చేసినట్లు తెలిపారు.
ఇక నెట్‌క్యాప్ ద్వారా 20,393 ఉద్యోగాలు, ఐటీ మరియు ఎలక్ట్రానిక్స్ రంగంలో 13,846 ఉద్యోగాలు, పర్యాటక రంగంలో 5,028 ఉద్యోగాలు, గనులు మరియు భూగర్భ శాఖలో 3,226 ఉద్యోగాలు కల్పించినట్లు సీఎం చంద్రబాబు నాయుడు వివరించారు. మొత్తంగా 20 నెలల పాలనలో లక్షలాది యువతకు ఉపాధి అవకాశాలు కల్పించామని ఆయన పేర్కొన్నారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews

















