కడప జిల్లా సీకే దిన్నె మండలంలో వైసీపీ నేతలు అక్రమంగా ప్రభుత్వ భూములను కబ్జా చేసిన ఘటన వెలుగుచూసింది. సుమారు రూ.20 కోట్ల విలువైన భూమిని అవకతవకల మార్గంలో తమ పేర్లపై రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లు అధికారులు గుర్తించారు.
ఈ విషయం తెలిసిన వెంటనే కడప కలెక్టర్ శ్రీధర్ తక్షణమే స్పందించారు. ఆయన ఆ రిజిస్ట్రేషన్లను రద్దు చేయాలని, ప్రభుత్వ భూములను తిరిగి స్వాధీనం చేసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
ప్రభుత్వ భూములపై అక్రమ రిజిస్ట్రేషన్లు, భూకబ్జాలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని కలెక్టర్ హెచ్చరించారు.


















