అయినవిల్లి, న్యూస్‌టుడే: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా అయినవిల్లి మండలం విలస గ్రామంలో మంగళవారం సాయంత్రం బాణసంచా పేలుడు సంభవించి దంపతులు మరణించారు. దీపావళి పండగ వస్తుండడంతో గత ఏడాది మిగిలిన బాణసంచాను ఇంటిలోని మిద్దె పైనుంచి కంచర్ల శ్రీనివాసరావు (55), ఆయన సతీమణి సీతామహాలక్ష్మి (50) దింపుతున్నారు. ఈ క్రమంలో పేలుడు సంభవించి ఇంటి గోడలు కూలిపోయాయి. ఆ శిథిలాల కింద చిక్కుకుని వీరిద్దరూ మరణించారు. పక్కగదిలో ఉన్న కుమారుడు ప్రదీప్ ప్రాణాలతో బయటపడ్డాడు. పేలుడు ధాటికి సమీపంలోని కొన్ని ఇళ్లకు పాక్షికంగా నష్టం ఏర్పడింది. శిథిలాల కింద ఉన్న మృతదేహాలను పోలీసులు వెలికితీయించారు.



















