ఇంటర్నెట్‌డెస్క్: తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలిపారు. కనకదుర్గమ్మ ఆశీస్సులు అందరికీ ఉండాలన్నారు. సంక్షేమం, అభివృద్ధితో మహాయజ్ఞాన్ని కొనసాగించే నైతిక బలం ఇవ్వాలని సీఎం చంద్రబాబు కోరారు. దసరా పండుగ.. ఇంటింటా వెలుగులు నింపాలని ఆకాంక్షించారు.
‘‘తెలంగాణ సాంస్కృతిక జీవన విధానంలో దసరాకు ప్రత్యేక స్థానం. చెడుపై మంచి సాధించిన విజయానికి చిహ్నంగా దసరా నిర్వహించుకుంటాం. తెలంగాణ సబ్బండ వర్గాల ఐక్యతకు ఈ పండగ నిదర్శనం. అప్రతిహత విజయాలతో రాష్ట్రం అభివృద్ధి సాధించాలని దుర్గమ్మను ప్రార్థిస్తున్నా’’- రేవంత్‌రెడ్డి
‘‘భక్తిశ్రద్ధలతో శరన్నవరాత్రులు ఆధ్యాత్మిక శోభను విరాజిల్లుతున్నాయి. భవానీ దీక్షలతో దసరా ఉత్సవాలు మరింత శోభను సంతరించుకున్నాయి. తెలుగు ప్రజలకు దసరా శుభాకాంక్షలు’’- పవన్ కల్యాణ్



















