భూమిక, సారా అర్జున్, గౌతమ్ వాసుదేవ్ మేనన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘యుఫోరియా’. కొత్త కాన్సెప్ట్‌తో గుణశేఖర్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. నీలిమా గుణశేఖర్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది ఫిబ్రవరి 6న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో, తాజాగా ‘యుఫోరియా’ టీజర్‌ను విడుదల చేశారు. మాదక ద్రవ్యాల వల్ల యువత ఎదుర్కొంటున్న సమస్యలను కథా నేపథ్యంగా తీసుకుని ఈ చిత్రం రూపొందినట్లు తెలుస్తోంది.




















