తాడిపత్రిలో నిర్వహించిన నూతన సంవత్సర వేడుకలు ఉత్సాహంగా సాగాయి. ఈ వేడుకల్లో పాల్గొన్న నగర ప్రజలతో కలిసి ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి ఉత్సాహంగా డాన్స్ చేస్తూ సందడి చేశారు. ఎమ్మెల్యే పదవిలో ఉన్నప్పటికీ తన కుర్రతనం ఇంకా తగ్గలేదని నిరూపిస్తూ, ప్రజలను ఉల్లాసపరిచారు. ప్రజలతో కలిసిమెలిసి వేడుకలను ఆనందంగా జరుపుకోవడం అక్కడి వాతావరణాన్ని మరింత ఉత్సాహభరితంగా మార్చింది.



















