అమ్రాబాద్ మండలంలోని హైదరాబాద్-శ్రీశైలం రహదారిలోని మన్ననూర్ లేక ఫర్హాబాద్ ముఖద్వారం నుంచి సఫారీ ప్రారంభమవుతుంది. మన్ననూర్‌లో కాటేజ్‌లు, వసతి గదులు ఉన్నాయి. వీటి అద్దె రోజుకు ధర రూ.5,100 నుంచి రూ.8,500 వరకు ఉంటుంది. మన్ననూర్ నుంచి ప్రారంభమైతే.. సఫారీలో ఫర్హాబాద్ వెళ్లడానికి 8 మంది పట్టే వాహనానికి రూ.వెయ్యి చెల్లించాలి. ఫర్హాబాద్ ముఖ ద్వారం నుంచి వ్యూపాయింట్ వరకు సఫారీ ట్రిప్‌నకు (8 మందికి) రూ.3 వేలు, వ్యూపాయింట్‌తో పాటు గుండం సఫారీకి వెళ్లిరావడానికి రూ.5 వేలు చెల్లించాల్సి ఉంటుంది.


















