చేయితిరిగిన చిత్రకారుడు వేసిన పెయింటింగ్‌లా కనిపిస్తున్న ఈ అద్భుత దృశ్యం వైఎస్సార్ కడప జిల్లాలోని ప్రసిద్ధ పర్యాటక కేంద్రం — గండికోటది. ‘భారత గ్రాండ్ కెనియన్’గా పేరుగాంచిన ఈ లోయ, దక్షిణాయన కాలంలో బంగారు కాంతులతో ప్రకాశిస్తూ అందాలను విరజిమ్ముతుంది. పడమటి దిశలోకి సూర్యుడు అస్తమించేప్పుడు, పాలకొండల మీదుగా వెలుగులు పరచుకుంటూ పెన్నా నదిలో ప్రతిబింబిస్తుంటే — ఆ దృశ్యం చూడటానికి రెండు కళ్లూ సరిపోవు. ఈ అపూర్వ సౌందర్యాన్ని ఆస్వాదించేందుకు ప్రకృతి ప్రేమికులు దూరదూరాలనుంచి గండికోటకు చేరుకుంటారు. గండికోటలోని జామా మసీదు సమీపం నుంచి కనిపించే ఈ అద్భుత దృశ్యమే చిత్రంలో ప్రతిబింబిస్తోంది.



















