ఇంటర్నెట్ డెస్క్: ఆస్ట్రేలియాతో జరుగుతున్న టీ20 సిరీస్‌లో తొలి మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. రెండో మ్యాచ్‌లో భారత్ ఓటమి పాలైంది. అయితే ఈ మ్యాచ్‌లో టీమ్ మేనేజ్‌మెంట్ తీసుకున్న నిర్ణయాలు పెద్ద చర్చకు దారితీశాయి. బ్యాటింగ్ క్రమం మార్పులతో పాటు అర్ష్‌దీప్ సింగ్‌కు తుది జట్టులో అవకాశం ఇవ్వకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ నిర్ణయాలు అర్థంకావడం లేదని మాజీ ఆటగాళ్లు వ్యాఖ్యానిస్తున్నారు. భారత్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన అర్ష్‌దీప్‌ను బెంచ్ వద్దే ఉంచడం ఆశ్చర్యానికి గురి చేసిందని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ ఆరోన్ ఫించ్ పేర్కొన్నాడు.




















