కొవూరు: తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలకు అండగా నిలుస్తూ కొవూరు ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి సేవా కార్యక్రమాలను నిరంతరంగా కొనసాగిస్తున్నారు. వరదలతో తీవ్రంగా ప్రభావితమైన గ్రామాల్లో ఆమె స్వయంగా పర్యటించి, బాధితులకు నిత్యావసర వస్తువులు, బట్టలు పంపిణీ చేశారు.
మూడు రోజులుగా ఆమె స్వంత నిధులతో భోజనాలు, పండ్లు పంపిణీ చేస్తూ ప్రజలకు అండగా నిలుస్తున్నారు. ఈ సేవా కార్యక్రమాలకు స్థానిక ప్రజలు స్పందనతో సహకరిస్తున్నారు.
ప్రశాంతి రెడ్డి మాట్లాడుతూ – “ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముందుగానే చర్యలు తీసుకోవడంతో పెన్నా పరివాహక గ్రామాల్లో పెద్ద ఎత్తున ప్రాణ, ఆస్తి నష్టం తప్పింది. కరకట్టల బలపరిచేందుకు ముందుగానే నిధులు మంజూరు చేయడం వల్ల ప్రమాదం తక్కువైంది” అని తెలిపారు.
తుఫాను విపత్తును ప్రభుత్వం సమర్థవంతంగా ఎదుర్కొన్నదని, అధికారులు అహర్నిశలు పనిచేసి ప్రజలను రక్షించారని ప్రశాంతి రెడ్డి అభినందించారు.
ఆమె మరిన్ని గ్రామాల్లో కూడా సహాయ కార్యక్రమాలను కొనసాగించనున్నట్లు తెలిపారు.
























